ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో

ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియోజోహనెస్బర్గ్: పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డే వివాదాస్పద రీతిలో ముగిసింది. సౌతాఫ్రికా విసిరిన 342 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించి ఒంటి చేత్తో పాకిస్థాన్‌కు విజయాన్ని సాధించేలా కనిపించిన ఫకర్ జమాన్ (193) అవుటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ అతన్ని మోసం చేసి అవుట్ చేశాడని, ఇదేం క్రీడాస్ఫూర్తి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంతి తనవైపే వస్తున్నా.. ఫకర్ జమాన్ తనను చూస్తున్న సమయంలో నాన్‌స్ట్రైకింగ్‌లో బంతి అందుకోవాల్సిందిగా డీకాక్ సైగ చేశాడు. బంతి ఎలాగూ నాన్‌స్ట్రైకింగ్‌లోకి వెళ్తుంది కదా అని ఫకర్ కాస్త మెల్లగా క్రీజును చేరుకునే ప్రయత్నం చేశాడు.
ఇంతలోపే త్రో నేరుగా వచ్చి స్టంప్స్‌ను తాకింది. ఫకర్ క్రీజుకు చాలా దూరంలో ఉండిపోయాడు. అప్పటికే 193 పరుగులు చేసి అలసిపోయిన ఫకర్.. నెమ్మదిగా పరుగు పూర్తి చేయాలనుకోవడం కొంప ముంచింది. అయితే ఫకర్ అవుటవగానే డీకాక్ అతన్ని చూసి నవ్వాడు. పైగా రీప్లేల్లోనూ డీకాక్ కావాలనే ఫకర్‌ను తప్పుదోవ పట్టించడానికి ఇలా చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్‌లో మోసం చేసి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడం నేరం. కానీ ఫకర్ విషయంలో అంపైర్లు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో అతడు పెవిలియన్ చేరాడు.
ఇవికూడా చదవండి..
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
కంటైన్మెంట్ జోన్‌గా జోధ్‌పూర్ ఐఐటీ
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
చిట్టి బుర్రల గట్టి ఆవిష్కరణలు
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

