తిమ్మాపూర్, నవంబర్4: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (Thimmapur) మండలంలో పెను ప్రాణనష్టం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట శివారులో వడ్ల బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డు పక్కన బోల్తాపడింది. బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు ముందుభాగం ధ్వసమైంది.
మెట్పల్లి డిపోకి చెందిన బస్సు (TS21Z0116) హైదరాబాద్ నుంచి మెట్పల్లి వెళ్తున్నది. ఈ క్రమంలో రేణిగుంట శివారులో ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాలీతో సహా ట్రాక్టర్ రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ రవి.. కిందికి దూకేశాడు. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. వారిలో 15 మంది గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
