Road Accident | రోడ్ టెర్రర్.. ఒకే రోజు మూడు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు (Travels Bus) ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. గత వారం కర్నూలు జిల్లాలో వేమురి కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మూడు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి.
Bus Accidents: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు (Travels Bus) ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. గత వారం కర్నూలు జిల్లాలో వేమురి కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మూడు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. నల్లగొండ (Nalgonda) జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి ముందువెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ (Tractor) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని కావలి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం దామరాజు పల్లి దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. మృతురాలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్‌లో భారతి ట్రావెల్స్‌కి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఆయా ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

