కరీంనగర్ కమాన్‌చౌరస్తా, నవంబర్ 3 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిల విడుదల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు జంగ్ సైరన్ మోగించాయి. అందులో భాగంగా సోమవారం నుంచి కాలేజీల నిరవధిక బంద్‌ను తలపెట్టాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాలలను మూసివేశాయి. శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ యాజమాన్య సంఘం(సుప్మా) ఆధ్వర్యంలో ఆయా కళాశాలల యాజమాన్యాల బాధ్యులు, అధ్యాపకులు కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. కాగా, బంద్‌కు పలు విద్యార్థి సంఘాల నాయకులు కూడా మద్దతు తెలుపడంతో పాటు ఆందోళనలు నిర్వహించారు.

Karimnagar4