హైదరాబాద్: కేసీఆర్‌పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్‌కు (Revanth Reddy) శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు (Basthi Dawakhana) సుస్తీ పట్టిందని మండిపడ్డారు. శేరిలింగంపల్లిలో బస్తీ దవాఖానను హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానలో సదుపాయాలను పరిశీలించారు. ఏఏ మందులు అందుబాటులో ఉన్నాయి, వైద్య పరికరాలు పనితీరు, వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జీతాలు అందుతున్నాయా అని సిబ్బందిని అడగడంతో.. నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని తమ కష్టాలను హరీశ్ రావుతో చెప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వడం లేదని చెప్పారు. గ్రీన్ చానల్ మాటలకే పరిమితమయిందని విమర్శించారు. ఈహెచ్ఎస్ కింద బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. బిల్లులను పెండింగ్ పెట్టడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
బస్తీ ప్రజలకు తమ గడప దగ్గరే వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. నాడు కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తంలో 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. వాటిలో 110 రకాల మందులను, 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారు. కానీ 22 నెలల కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకే సుస్తీ పట్టుకున్నది. లింగంపల్లిలో ఉన్న బస్తీ దవాఖానా సిబ్బంది తమకు 5-6 నెలల నుండి జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు. నిత్యావసరమైన మందులు కూడా అందుబాటులో లేవు. రేవంత్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.
సీఎం రేవంత్ రెడ్డి కొత్త వైన్ షాపుల అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాదని విమర్శించారు. దరఖాస్తులు తక్కువ వచ్చాయని వారం రోజులు గడువు పెంచిండని మండిపడ్డారు. మద్యం దుకాణాల మీద, ఆదాయం మీద ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్యం శ్రద్ద లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్ ఎందుకు రావడం లేదని, బస్తీ దవాఖానలో మందులు ఎందుకు లేవని నిలదీశారు. బస్తీ దవాఖానల సిబ్బందికి జీతాలు ఎందుకు వస్తలేవన్నారు. ఒక్కరోజైనా రివ్యూ చేశావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మద్యం దుకాణాల గురించి తప్ప గరీబ్ వాళ్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చినంక నల్లా నీళ్ళకు బిల్లులు వేసి పైసలు కట్టాలి అంటున్నరు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలె. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే బస్తీ దవాఖానాలు బాగుపడతాయి.
Live: Former Minister @BRSHarish visit to Basthi Dawakhana at Old Lingampally Village, Serilingampally https://t.co/rAhY8Ne61X
— Office of Harish Rao (@HarishRaoOffice) October 21, 2025