కొండాపూర్, అక్టోబర్ 21: హైదరాబాద్లోని చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని ఓల్డ్ ముంబై రోడ్డులో ఉన్న నాలా సమీపంలో మంజీర మంచి పైపులైన్ (Manjeera Pipeline) వాల్వు లీక్ అయ్యింది. దీంతో మంచి నీరు భారీగా ఎగిరిపడుతున్నది. ఈ నేపథ్యంలో అటుగా రాకపోకలు జరిపే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీటి వృథాను అరికట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు. నీరు అధిక ప్రెజర్తో పైకి ఎగసి విద్యుత్ తీగలకు తగులుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.