Vijay Devarakonda | యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలతో, స్టైల్‌తో, మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే విజయ్, ఇటీవల విడుదలైన ‘కింగ్డమ్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ‘రౌడీ జనార్దన్’, అలాగే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఆయన సరసన కీర్తి సురేష్, రష్మిక మందానా నటిస్తున్నారు.
ఇటీవల రష్మికతో విజయ్ సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలు వస్తుండగా, ఇప్పుడు ఆయన చేసిన పాత కామెంట్లు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘లైగర్’ మూవీ ప్రమోషన్ల సమయంలో, బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా కరణ్ అడిగిన బోల్డ్ ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. “నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్‌లో శృంగారం చేశావా?” అని అడగ్గా, విజయ్ ఏ మాత్రం ఆలోచించకుండా “అవును, బోటులో చేశా… అవసరమైతే కారులో కూడా చేస్తా” అని చెప్పాడు. అంతేకాకుండా “ముగ్గురితో ఒకేసారి చేయడంలో కూడా నాకు ఇబ్బంది లేదు” అని చెప్పడంతో ఆ కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి.
ఇప్పుడు ఆ క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు “సౌత్‌లో ఇంత బోల్డ్‌గా సమాధానమిచ్చే హీరో మరొకరు లేరు” అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు “షో హైప్ కోసం అలా మాట్లాడాడు” అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ.. విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశాడు. అది కేవలం షో స్పిరిట్‌లో భాగంగా నేను చెప్పిన సరదా సమాధానం మాత్రమే. కాఫీ విత్ కరణ్ షోలో అలాంటి ప్రశ్నలు, సమాధానాలే ప్రధాన ఆకర్షణ. నేను ఎవరికీ ఇబ్బంది కలిగించాలనుకోలేదు అని తెలిపారు. ప్రస్తుతం విజయ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఆయన కొత్త సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.