Baahubali: The Epic | ‘బాహుబలి’ రీ రిలీజ్.. ఐమాక్స్ వెర్షన్ ట్రైలర్ విడుదల!
Baahubali: The Epic | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విజువల వండర్ బాహుబలి సినిమా మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
Baahubali: The Epic | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విజువల వండర్ బాహుబలి సినిమా మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) అనే పేరుతో రెండు భాగాలను ఒకే పార్టుగా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఐమాక్స్ వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాను కేవలం రీ-రిలీజ్‌గా కాకుండా, సరికొత్త అనుభూతినిచ్చేలా మెరుగైన సాంకేతిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను ఐమాక్స్ (IMAX) తో పాటు, 4DX, డాల్బీ సినిమా వంటి అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు. రీమాస్టర్డ్ పిక్చర్ మరియు సౌండ్ క్వాలిటీతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వబోతుంది. మరోవైపు ఈ సింగిల్ వెర్షన్ సినిమా నిడివి దాదాపు 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేయగా ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇక పదేళ్ల తర్వాత బాహుబలి మాయాజాలాన్ని బిగ్ స్క్రీన్‌పై ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

