భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భూదాన్ పోచంపల్లి మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా వై.రవీందర్, కార్యదర్శిగా జె.వెంకటేశం, ఫైనాన్స్ సెక్రటరీగా పి.సత్తిరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జి.సుదర్శన్, వైస్ ప్రెసిడెంట్‌గా కృష్ణారెడ్డి, ప్రభావతి, జాయింట్ సెక్రటరీగా నరసింహారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అండాలు, పబ్లిసిటీ సెక్రటరీగా జె.సుదర్శనం, జిల్లా కౌన్సిలర్‌గా పి.సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు.