Missing | నర్సాపూర్, సెప్టెంబర్ 12 : బాత్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని తుజాల్పూర్ గ్రామం అర్జుతాండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం కథనం ప్రకారం తుజాల్పూర్ గ్రామం అర్జుతాండాకు చెందిన కొర్ర పవన్‌కు గత మూడు సంవత్సరాల క్రితం మేడ్చల్ జిల్లా, దుండిగల్ మండలం, గండిమైసమ్మ గ్రామానికి చెందిన బానోత్ మౌనిక (20)తో వివాహం జరిగింది.
పవన్‌కు మానసికస్థితి సరిగ్గా లేక రెండు సంవత్సరాల క్రితం మౌనిక భర్తతో గొడవ పడి తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈ నెల 8వ తేదీన మేడ్చల్ కోర్టు నందు మౌనిక పవన్ కుటుంబ సభ్యులు మాట్లాడుకొని రాజీపడ్డారు. అదే రోజున మౌనిక పవన్ ఇంటికి రావడం జరిగింది. గురువారం నాడు మధ్యాహ్న సమయంలో మౌనిక బాత్రూమ్కు వెళ్లి వస్తానని తన భర్త పవన్‌కు చెప్పి వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వారిని, తల్లిదండ్రుల వద్ద వెతికినా ఎలాంటి జాడ తెలియలేదు.
మౌనిక ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు చీర ధరించి, గుండ్రటి మొఖం, తెలుపు రంగులో ఉంటుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం వెల్లడించారు.
Mata Vaishno Devi | ఈ నెల 14 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం..!
Shah Rukh Khan | 1500 కుటుంబాలకు సాయం… మరోసారి గొప్ప మనసు చాటుకున్న షారుఖ్ ఖాన్