రామగిరి, సెప్టెంబర్ 12 : పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన సుంకరి భిక్షం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భిక్షం గౌడ్ సాదారణ సంఘ కార్యకర్త నుంచి ఎదిగి గతంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. సంఘం అభివృద్ధికై నిరంతరం పనిచేస్తూ ఉపాధ్యాయుల పక్షంలో నిలిచి ఎన్నో సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషించి ఉపాధ్యాయులు మన్ననలు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి భిక్షం గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికవడం పట్ల పీఆర్టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి, ఉపాధ్యాయుడు వీరమళ్ల శ్రీనివాసులు, జిల్లా కమిటి సభ్యులు, మండలాల బాధ్యులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.