Karepally : ‘భారతీయ భావనకు ప్రతిరూపం సీతారాం ఏచూరి’
విభిన్న సంస్కృతులు, భాషలు, ఆచార సాంప్రదాయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు కలయికే భారతీయత అని, అటువంటి భారతీయతకు నిజమైన ప్రతిరూపం సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు.
కారేపల్లి, సెప్టెంబర్ 12 : విభిన్న సంస్కృతులు, భాషలు, ఆచార సాంప్రదాయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు కలయికే భారతీయత అని, అటువంటి భారతీయతకు నిజమైన ప్రతిరూపం సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కారేపల్లిలో సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారతీయతను కాపాడుటకై తన జీవితకాలాన్ని అంకితం చేసిన త్యాగశీలి సీతారాం ఏచూరి అన్నారు. సమిష్టి తత్వానికి ప్రతిరూపమైన భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఆ ప్రయత్నాన్ని గత ఎన్నికల్లో ఇండియా కూటమిని నిర్మించడం ద్వారా సీతారాం ఏచూరి అడ్డుకున్నట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలలో 400 సీట్లు వస్తాయని విర్రవీగిన మోదీ, సీట్లు తగ్గి ఇతర పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే బీహార్ లో ఎస్ఐఆర్ తీసుకొచ్చి దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిని అనార్హులుగా ప్రకటిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరిచి పోరాడటమే సీతారాం ఏచూరి ఆశయాలను సాధిండమని, దానికి అందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు వజ్జా రామారావు, సీనియర్ నాయకులు తలారి దేవ ప్రకాష్, ముక్క సీతారాములు, హామాలి మేస్త్రీ ఆరెల్లి శ్రీరాములు, సైదులు, సంపత్, వెంకన్న, బాబు, రాములు, ఉపేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

