స్మార్ట్‌ఫోన్ కెమెరా ప్రస్తావన వచ్చిందంటే.. ‘వివో’ గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే! సరికొత్త మోడల్స్, అధునాతన సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీని కొత్తపుంతలు తొక్కిస్తున్నది. తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. మరో అత్యాధునిక కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లో సందడి చేసేందుకు ఈ చైనా సంస్థ సిద్ధమైంది. ఏకంగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో.. తన తర్వాతి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌కు రూపకల్పన చేసింది. వివో ఎక్స్300 సిరీస్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు ‘వివో’ సన్నాహాలు చేస్తున్నది. తన సరికొత్త మోడల్స్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను సంస్థ ఇప్పటికే వెల్లడించింది. 300 సిరీస్‌లో హైఎండ్ మోడల్ అయిన ‘వివో ఎక్స్ 300 ప్రో’లో 6.78 అంగుళాల 1.5కే రెజల్యూషన్‌తో ఫ్లాట్ అమోల్డ్ డిస్ప్లేను ఏర్పాటు చేసింది.
స్లిమ్, యూనిఫాం బెజెల్స్‌తో ఈ మోడల్ రానున్నది. కెమెరా విషయానికి వస్తే.. వివో, జెయిస్ భాగస్వామ్యంతో అత్యాధునిక 200ఎంపీ జెయిస్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫొటోలు ప్రొఫెషనల్‌గా తీయడానికి ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీని వాడారు. దీనితోపాటు 50 ఎంపీ సూపర్ పెరిస్కోప్ టెలీఫొటో లెన్స్‌ను అమర్చారు. ముందుభాగంలో సెల్ఫీల కోసం 50ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. ఎక్స్930 కోర్, ఇమ్మోర్టాలిస్-డ్రేజ్ జీపీయూతో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను ఇందులో పొందుపర్చారు. ఎలాంటి ల్యాగ్ లేకుండా.. అన్నిరకాల గేమింగ్స్‌ను ఈజీగా ఆడేయొచ్చు. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీర్ఘకాలంపాటు వస్తుంది. 90వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. వీటితోపాటు అనేక ఫీచర్లున్న ఈ స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నది.