డిప్యూటీ గవర్నర్లకు విభాగాలు కేటాయించిన ఆర్బీఐ
కొత్తగా నియమితులైన డిప్యూటీ గవర్నర్లకు విభాగాలు కేటాయిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయం తీసుకున్నది

ముంబై: కొత్తగా నియమితులైన డిప్యూటీ గవర్నర్లకు విభాగాలు కేటాయిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయం తీసుకున్నది. టీ రబీ శంకర్ కరెన్సీ నిర్వహణ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ మారకద్రవ్యంతోపాటు ఎనిమిది విభాగాలను పరిశీలిస్తారని ఆర్బీఐ తెలిపింది.
శంకర్ మూడేండ్ల కాలానికి ఆర్బీఐ నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ గవర్నర్ పదవికి రావడానికి ముందు రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. శంకర్‌ను డిప్యూటీ గవర్నర్‌గా నియమించడంతో మిగతా ముగ్గురు డిప్యూటీ గవర్నర్లకు కూడా పోర్ట్‌ఫోలియోలను ఆర్బీఐ పునరుద్దరించింది.
కీలక ద్రవ్య విధాన విభాగం ఎండీ పత్రా వద్ద ఉన్నది. దీనితోపాటు కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ బడ్జెట్ విభాగం, ఆర్థిక, విధాన పరిశోధన విభాగం, గణాంకాలు, సమాచార నిర్వహణ విభాగం, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్స్ విభాగం మరియు ఆర్థిక స్థిరత్వ యూనిట్ వంటి వాటిని పత్రా చూసుకుంటారు.
సమాచార హక్కు (ఆర్టీఏ) విభాగంతో పాటు బాహ్య పెట్టుబడులు, కార్యకలాపాల విభాగాలు, ప్రభుత్వ , బ్యాంక్ ఖాతాలు, చెల్లింపు, పరిష్కార వ్యవస్థలు , అంతర్గత రుణ నిర్వహణను కూడా శంకర్ చూసుకుంటారు.
డిప్యూటీ గవర్నర్ ఎం కే జైన్ ఆధ్వర్యంలో తొమ్మిది విభాగాలు ఉన్నాయి. వాటిలో సమన్వయం, కేంద్ర భద్రతా విభాగం, వినియోగదారుల విద్య, రక్షణ, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ, రాజ్‌భాషా విభాగాలు ఉన్నాయి.
డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఆరు విభాగాలు ఉన్నాయి. నియంత్రణ విభాగం, కమ్యూనికేషన్ విభాగం, ఎన్ఫోర్స్మెంట్ విభాగం, తనిఖీ విభాగం, న్యాయ విభాగం, రిస్క్ మానిటరింగ్ విభాగాలను రాజేశ్వర్‌రావు చూసుకుంటారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్లో బస్సు ప్రమాదం: 15 మంది మృతి
‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ
సంకీర్ణం ఏర్పాటులో నెతన్యాహు విఫలం.. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధం
మయన్మార్‌లో పార్సిల్ బాంబు పేలుడు, ఎంపీ సహా ఐదుగురు మృతి
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

