ఇల్లెందు, నవంబరు 06 : ఇల్లెందు సింగరేణి ఏరియాలో ఉదయం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కెఓసి, జెకెఓసి, ఎస్ &పీసీ, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, సివిల్ డిపార్ట్మెంట్, సీహెచ్పీ, ఏరియా హాస్పిటల్ వద్ద కార్మికులు, నాయకులు ధర్నాలు నిర్వహించారు. అయా గని అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కార్మిక సమస్యలు పరిష్కరించాలని, తక్షణమే మెడికల్ బోర్డును ప్రారంభించాలని, కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, అలవెన్స్ ( పెర్క్స) పై పన్నును కోల్ ఇండియా మాదిరిగా తమకు కంపెనీ చెల్లించాలన్నారు. మెడికల్ అన్ ఫిట్ అయిన డిపెండెంట్ ఉద్యోగులకు వెంటనే నియామాక పత్రాలు ఇవ్వాలని, మారుపేరులతో ఉద్యోగం చేస్తున్న వారి సమస్యను పరిష్కరించి వారికి అవకాశం కల్పించాలన్నారు.
డిస్మిస్ అయిన ఉద్యోగులకు ఒకసారి అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న సాయంత్రం 4 గంటలకు జీఎం కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, మాలొత్ హరిసింగ్, దాట్ల వెంకటేశ్వర్లు, కలవల సిద్దార్థ్, విజయరాజ్, రంజిత్ కుమార్, యాకుబ్, చాంద్ షాషా, నాయకులు గుగులోత్ కృష్ణ, గుగ్గిల్ల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, ఎస్ రవి, బట్టు రవి, ప్రవీణ్ కుమార్, హేమంత్ కుమార్, రామారావు, ప్రసాద్ రెడ్డి, సోలెం వెంకటేశ్వర్లు, చావా కృష్ణ, గోపిసింగ్, ఆర్ ఎల్, శ్రీనివాసులు, విజయ్ ప్రసాద్, సిస్టర్ అనిత, సింధు, కందకట్ల శ్వేతా, చంద్రకళ పాల్గొన్నారు.