IND vs AUS : భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఆస్ట్రేలియా(Australia)కు అక్షర్ పటేల్ షాకిచ్చాడు. దంచికొడుతున్న డేంజరస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్(25)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో.. పరుగలు వద్ద ఆతిథ్య జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మొదట అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ తీసకొని టీమిండియా అతడి వికెట్ సాధించింది. ఆతర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్(10) బుమ్రా ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. దాంతో.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ఆసీస్ 48 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేదు. మిడిలార్డర్ చేతులెత్తేగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి167 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(28) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
A successful review by #TeamIndia as Matthew Short is out LBW!@akshar2026 strikes in his first over 👏
Live – https://t.co/Iep4K7ytVn #TeamIndia #AUSvIND #4thT20I pic.twitter.com/cQ9DbaJWHd
— BCCI (@BCCI) November 6, 2025
ఫామ్ లేమితో తంటాలు పడుతున్న గిల్.. ఎట్టకేలకు క్రీజులో నిలిచి జట్టును ఆదుకున్నాడు. మిడిలార్డర్లో శివం దూబే(22), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(20)లు ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో అక్షర్ పటేల్(21 నాటౌట్) ధనాధన్ ఆడడంతో టీమిండియా పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.