నల్లగొండ, నవంబర్ 06 : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అభిమాని, సామాజిక కార్యకర్త సయ్యద్ అబ్రార్ హష్మీ నల్లగొండ నుండి జూబ్లీహిల్స్ వరకు సైకిల్ యాత్రగా చేరుకున్నారు. అక్కడ హాస్టల్లో బస చేసిన నల్లగొండ నాయకులను కలుసుకున్నారు. వారితో కలిసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ విజయం కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అబ్రార్ స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొనడం పట్ల నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.