– స్థల పత్రాలు అందజేత
మధిర, నవంబర్ 06 : చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా వ్యవసాయ మార్కెట్కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి, గుర్తింపు పూర్తి చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు మార్కెటింగ్ అధికారులకు స్థల స్వాధీన పత్రాలను రెవెన్యూ అధికారులు, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావుకి అందజేశారు.
ఈ సందర్భంగా అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ నూతన మార్కెట్ చింతకాని, ముదిగొండ మండలాల పరిధిలోని రైతుల ఆర్థికాభివృద్ధికి ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండలం తాసీల్దార్ బాబ్జి ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలిమ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పరసగాని తిరుపతిరావు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు, మార్కెట్ పాలకవర్గ సభ్యులు, మత్కేపల్లి, జగన్నాధపురం గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు పాల్గొన్నారు.