Funky | టాలీవుడ్లో ఫ్యామిలీ, యూత్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ యాక్టర్లలో ఒకరు విశ్వక్సేన్ (vishwak sen). ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫంకీ’. జాతిరత్నాలు ఫేం కేవీ అనుదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ కయాదు లోహర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తుంది.
కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. మరోవైపు ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఫంకీ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ సినీ దర్శకుడిగా నటిస్తుండగా.. కయాదు లోహర్ నిర్మాతగా కనిపించనుంది. తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
అల్లూరి సినిమా తర్వాత కయాదు లోహర్ తెలుగులో చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ సినీ ఇండస్ట్రీపై సెటైరికల్‌గా తెరకెక్కుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.
Unlimited Laughter. 😆
Unlimited Entertainment. 😎
Unlimited FUN! 🥳#FUNKY GRAND RELEASE WORLDWIDE on APRIL 3rd, 2026. 🎬#FunkyFromApril3rd 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri… pic.twitter.com/KLdhiJrMWL
— Sithara Entertainments (@SitharaEnts) November 6, 2025
Harish Rai | శాండల్‌వుడ్‌లో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం