Harish Rai | శాండల్‌వుడ్‌లో విషాదం నెలకొంది. కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు. గత కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరీశ్ రాయ్ తన సుదీర్ఘ నట జీవితంలో ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ‘ఓం’ (1995) సినిమాలో డాన్ రాయ్‌గా, ‘కేజీఎఫ్’ (K.G.F) సిరీస్‌లో ఖాసిం చాచా (Kasim Chacha) గా ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి.
మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో హరీశ్ రాయ్ తన అనారోగ్య పరిస్థితిని వెల్లడించారు. ఆర్థిక సాయం చేయాలని ఆయన సినీ ప్రముఖులను కోరగా, పలువురు హీరోలు స్పందించి సహాయం అందించారు. కేజీఎఫ్‌లో హరీశ్ రాయ్ గడ్డం పెంచడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ టైంలో అతడు క్యాన్సర్‌తో బాధ పడుతుండగా.. క్యాన్సర్ వలన గొంతు వాచిపోయింది. అది కనపడకుండా ఉండేందుకు గడ్డం పెంచానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు.