Globe Trotter | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రపంచస్థాయి సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాత్కాలికంగా ‘SSMB 29’ , ‘గ్లోబ్ ట్రాటర్’ పేర్లతో ఈ చిత్రాన్ని పిలుచుకుంటున్నారు. ఈ పాన్‌వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో మూవీకి సంబంధించి అనేక విషయాలు రివీల్ చేయనున్నారు. జియో హాట్‌స్టార్ ఈ గ్రాండ్ ఈవెంట్‌ని తమ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ వేడుకలో మహేష్ బాబు – రాజమౌళి సినిమా టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్లు లేదా ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసే అవకాశమూ ఉందని ఫిలిం నగర్ టాక్. ఇక ఈ ఈవెంట్లో రాజమౌళి చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు. పలువరు టాలీవుడ్ టాప్ హీరోలని కూడా ఈవెంట్‌కి గెస్ట్‌గా పిలవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం. ప్రస్తుతం ‘SSMB 29’ షూటింగ్ ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో చిత్రీకరణ జరగబోతోందని, ఈ సినిమా ఇండియన్ సినిమాకు కొత్త స్టాండర్డ్ సెట్ చేయబోతోందని టాక్.
సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో రానున్న భారీ ప్రాజెక్ట్ లో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. గ్లోబల్ బ్యూటీ తొలిసారి మహేష్ బాబుతో జత కట్టడంతో వీరి కెమిస్ట్రీ తెరపై ఫ్యాన్స్‌కి మంచి వినోదం పంచనుందని భావిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది . ఒరిస్సా, కెన్యా వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.