CP Sajjanar | హైదరాబాద్ : ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన ఐఏఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మళ్లీ తుపాకీ పట్టారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ శివార్లలోని తెలంగాణ పోలీసు అకాడమీకి సీపీ సజ్జనార్ వెళ్లారు. హైదరాబాద్ సిటీ పోలీసు బృందంతో కలిసి ఆయన పిస్టల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. షూటింగ్ రేంజ్‌కు వెళ్లడం, లక్ష్యం గురి తప్పకుండా కొట్టడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని ఇస్తుందని, బుల్స్ ఐకి గురిపెట్టి కొట్టడం థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీపీ సజ్జనార్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
వీసీ సజ్జనార్ హైదరాబాద్ సీపీ ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు దాదాపు నాలుగేండ్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందు సజ్జనార్ సైబరాబాద్ సీపీగా విధులు నిర్వర్తించారు.
Joined my #Hyderabad City Police team for firing practice session at TGPA today. Always a great feeling to be back on the range and thrilling to hit the bullseye🎯 #HyderabadCityPolice @TelanganaDGP pic.twitter.com/HyQeVyMFWZ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 6, 2025