Ration Dealer | రామవరం, సెప్టెంబర్ 2 : ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో తూకంలో తేడా ఉందని ప్రశ్నించిన యువకుడిపై రేషన్ డీలర్ దాడికి దిగాడు. తూకంలోని మోసాన్ని తన సెల్ ఫోన్లో వీడియో తీస్తున్న యువకుడి సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొన్నాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరానికి చెందిన బైర బోయిన నాగేంద్రప్రసాద్ మంగళవారం చౌకధరల దుకాణం నెంబర్ 17లో రేషన్ బియ్యం తీసుకునేందుకు రేషన్ షాప్‌కి వెళ్లాడు. అక్కడ ఉన్న బినామీ రేషన్ డీలర్ గోనె సంచి తూకం వేయడంతో.. అలా వేయడం వల్ల తూకంలో ఆ బస్తా సంచితో సహా తూకం వస్తుందని అలా కాకుండా తాము తెచ్చుకున్న సంచిలో వేసి తూకం వేయాలని బినామీ డీలర్‌ని అడిగాడు.. దీంతో సదరు రేషన్ డీలర్ అలా కుదరదు ప్రభుత్వం మాకు బస్తాకు రెండు కిలోలు తక్కువగా బియ్యం ఇస్తుందని.. అది మేము ఎలా జమ చేసుకోవాలని యువకుడిని ప్రశ్నించాడు.
ఇది తప్పు అంటూ యువకుడు రేషన్ బియ్యం తూకాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీస్తూ ప్రశ్నించగా.. డీలర్ ఆగ్రహించి బెదిరింపులకు పాల్పడుతూ సెల్‌ఫోన్‌ను లాక్కొన్నాడు. 17వ నెంబర్ షాపు డీలర్‌కు మరోసారి పౌరసరఫరాల శాఖ అధికారులు ఎప్పుడు అదనంగా ఒకటి రెండు షాపులను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ డీలర్ పేరు మీద రెండు షాపులు ఉన్నాయి. ఈ రెండు షాపుల్లో కూడా డీలర్ కాకుండా బినామీ డీలర్లు ఉండి లబ్ధిదారులకు తక్కువ తూకం వేసి ఇవ్వడం అలవాటుగా మారింది. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణిని వివరణ కోరగా.. ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో బిజీగా ఉన్నాం. రెండు రోజుల తర్వాత పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండతోనే చెలరేగిపోతున్నారని విమర్శలు సైతం లేకపోలేదు. ఈ చర్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మాట్లాడుతూ.. ఇలాంటి తూకం తేడాలు ఎన్నోసార్లు జరుగుతున్నా ప్రజలు భయంతో మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరో ధైర్యంగా మాట్లాడితే దానికి తగిన పరిణామాలేనా?” అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారుల నుంచి స్పందన రావాల్సి ఉంది. బాధితుడు రేషన్ బినామీ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఒరిజినల్ డీలర్ దుకాణంలో ఉండి బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా పంపిణీ వ్యవస్థ పట్ల ప్రజల్లో భద్రతా భావం కలిగేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత