Honeymoon murder : రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసు (Murder case) లో అరెస్టయిన నాలుగో నిందితుడు ఆనంద్ కుర్మి (Anand Kurmi) ను కూడా పోలీసులు ఇండోర్ (Indore) లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (CJM) ముందు హాజరుపర్చారు. దాంతో న్యాయమూర్తి అతడికి సైతం 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ (Transit remand) విధించారు. మేఘాలయ పోలీసులు (Meghalaya police) ఆనంద్‌ను కూడా షిల్లాంగ్ (Shillang) తరలించి విచారించనున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు.. రాజ్ కుశ్వాహ (20), ఆకాశ్ రాజ్‌పుత్ (21), విశాల్‌సింగ్ చౌహాన్ (22) లను సోమవారం సాయంత్రం ఇండోర్‌లోని సీజేఎం ముందు హాజరుపర్చగా 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. నాలుగో నిందితుడు ఆనంద్ కుర్మి (23) ని పోలీసులు బినా జిల్లా నుంచి ఇండోర్‌కు తీసుకొచ్చేసరికి ఆలస్యం జరిగింది. దాంతో అతడిని మంగళవారం ఉదయమే న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు.
దాంతో జడ్జి అతడికి కూడా జడ్జి 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. అంటే జూన్ 16న అతడి ట్రాన్సిట్ రిమాండ్ ముగియనుంది. మిగతా ముగ్గురు నిందితులకు కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ విధించడంతో సోమవారం రాత్రే వారిని మేఘాలయ పోలీసులు షిల్లాంగ్‌కు తీసుకెళ్లారు. ఇవాళ ఆనంద్‌ను కూడా షిల్లాంగ్ తరలించనున్నారు.
కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత సోనమ్ కోసం పోలీసులు వెతుకుతుండగా సోమవారం తెల్లవారుజామున యూపీలో ఆమె సజీవంగా ప్రత్యక్షమైంది.
దాంతో సోనమే భర్తను హత్య చేయించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట మిస్సింగ్ వార్త తెలిసినప్పటి నుంచే కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. యూపీలోని ఘాజీపూర్‌లో సోనమ్ అరెస్ట్‌తో కలిపి ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 5కు చేరింది. సోనమ్‌ను కూడా మేఘాలయ పోలీసులు సోమవారం రాత్రి షిల్లాంగ్‌కు తీసుకెళ్లారు.
కాగా సోనమ్ తాను హత్య చేయించలేదని చెబుతోంది. తన ఒంటిపై ఉన్న నగల కోసం కొందరు దుండగులు దాడి చేయగా తన భర్త అడ్డుకున్నాడని, దాంతో ఆయనను హత్య చేశారని అంటోంది. అయితే ఇందులో ఏది నిజమో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
#WATCH | Indore, MP: Raja Raghuvanshi murder case | The fourth accused, Anand, has been sent to transit remand for 7 days till 16th June. pic.twitter.com/ILf3mtqPdW
— ANI (@ANI) June 10, 2025