Honeymoon murder | ఆ ముగ్గురు నిందితులకు 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్
Honeymoon murder | రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన నిందితుల్లో ముగ్గురికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జడ్జి 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. దాంతో నిందితులు ముగ్గురిని షిల్లాంగ్ పోలీసులు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు తీసుకెళ్లి విచారించనున్నారు.
Honeymoor murder : రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన నిందితుల్లో ముగ్గురికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జడ్జి 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. దాంతో నిందితులు ముగ్గురిని షిల్లాంగ్ పోలీసులు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు తీసుకెళ్లి విచారించనున్నారు. కేసులో నాలుగో నిందితుడిని బినా జిల్లాలోని సాగర్ ఏరియా నుంచి ఇండోర్‌కు తీసుకొస్తున్నారు.
ఇండోర్‌కు చేరుకోగానే అతడిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. అతడికి కూడా 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసులు నలుగురిని షిల్లాంగ్‌కు తరలించనున్నారు. నిందితులు ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, రాజ్‌సింగ్ కుశ్వాహలకు ట్రాన్సిట్ రిమాండ్ విధించగా.. మరో నిందితుడు ఆనంద్‌ను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది.
మరోవైపు యూపీలోని ఘాజీపూర్‌లో లొంగిపోయిన సోనమ్ రఘువంశీని పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం ఘాజీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను కూడా షిల్లాంగ్ కు తరలించనున్నారు. సోనమ్ రఘువంశీనే కిరాయి హంతకులను పెట్టి భర్తను హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23 నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్ జాడ తెలియలేదు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఆమె ఘాజీపూర్‌లో లొంగిపోయింది.
Read More >>
‘సోనమ్ చాలా మంచిది.. అలాంటి పని చేయదు’
నన్ను కాపాడి నా భర్త హత్యకు గురయ్యాడు : దాబా ఓనర్‌తో సోనమ్ రఘువంశీ
రఘువంశీ తల ముందు, వెనుక బలమైన గాయాలు.. పోస్టుమార్టంలో వెల్లడి
హోటల్ రూమ్‌లో మహిళను చంపిన లవర్
మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతి
భర్తను భార్యే హత్య చేయించింది.. వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

