Honeymoon Murder | రఘువంశీ తల ముందు, వెనుక బలమైన గాయాలు.. పోస్టుమార్టంలో వెల్లడి
Honeymoon Murder | భార్యతో హనీమూన్ (Honeymoon) కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) తలకు ముందు భాగంలో, వెనుక భాగంలో రెండు బలమైన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. పూర్తి పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Honeymoon Murder : భార్యతో హనీమూన్ (Honeymoon) కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) తలకు ముందు భాగంలో, వెనుక భాగంలో రెండు బలమైన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. పూర్తి పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మృతుడి భార్యే హంతకురాలని, కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని వ్యాపార కుటుంబానికి చెందిన రాజా రఘువంశీ గత నెల 11న యూపీకి చెందిన సోనమ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొత్త జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23న తూర్పు కాసీ హిల్స్ జిల్లాకు వెళ్లి కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఆ జంట కోసం తీవ్రంగా గాలించారు.
దాదాపు 11 రోజుల తర్వాత జూన్ 8న రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్ కోసం కూడా గాలిస్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. హత్యలో ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా మేఘాలయ పోలీసులు అరెస్టు చేశారు. రాజ రఘువంశీని చంపేందుకు సోనమ్ తమకు సుపారీ ఇచ్చిందని నిందితులు పోలీసులకు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 20న హనీమూన్‌కు బయలుదేరిన కొత్త జంట అసోం రాజధాని గువాహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువహటిలో కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహ్రా (చిరాపుంజి) ని సందర్శించడానికి ఓ యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు.
మరుసటి రోజు సోహ్రారిమ్ అనే గ్రామ సమీపంలో నవ దంపతుల యాక్టివా పడి ఉంది. కానీ ఆ దంపతులు కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More >>
Bomb threat | గుజరాత్ హైకోర్టుకు బాంబు బెదిరింపు.. Video
హోటల్ రూమ్‌లో మహిళను చంపిన లవర్
మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతి
భర్తను భార్యే హత్య చేయించింది.. వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
Bride Flees | పెళ్లయిన నాలుగు రోజులకే వధువు షాక్.. రూ.18 లక్షల నగలు, నగదుతో పరార్!
Renu Desai | దీపావళి అయిపోయినా అర్ధరాత్రి పేల్చడం ఏంటి.. ‘ఇతరులను హింసించకండి’ అంటూ రేణూ ఘాటు వ్యాఖ్యలు!
Khammam | సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

