e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు

పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు

పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ : ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఐదు రైళ్లను సుదూర ప్రాంతాలకు వీక్లీ ట్రైన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో హజ్రత్‌ నిజాముద్దీన్‌ – సిక్రిందాబాద్‌, ఎర్నాకుళం – పాట్నా, అహ్మదాబాద్‌ – సుల్తాన్‌పూర్‌, అహ్మదాబాద్‌ – పాట్నా, అహ్మదాబాద్‌ – గోరఖ్‌పూర్‌ సర్వీసులు మధ్య నడువనున్నాయి.

ట్రైన్‌ నంబర్‌ 02438/02437 నిజాముద్దీన్-సికింద్రాబాద్-నిజాముద్దీన్ వీక్లీ రాజధాని సూపర్ ఫాస్ట్ స్పెషల్‌. ఈ నెల 4వ తేదీ నుంచి ప్రతి ఆదివారం నిజాముద్దీన్‌ నుంచి సిక్రిందాబాద్‌ వరకు నడవనుంది. నిజాముద్దీన్‌లో మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌ నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి ప్రతి బుధవారం నిజాముద్దీన్‌కు నడుస్తుంది. ఝాన్సీ, భోపాల్‌పూర్‌, నాగ్‌పూర్‌, బల్లర్షా, కాజిపేట్‌ స్టేషన్లలో ఆగుతుంది.

అలాగే ట్రైన్‌ నంబర్‌ 06359/06360 ఎర్నాకుళం-పాట్నా-ఎర్నాకుళం మధ్య నడువడనుండగా.. మే 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. 09403/09404 నంబరు గల అహ్మదాబాద్ – సుల్తాన్పూర్ – అహ్మదాబాద్ వీక్లీ సూపర్ ఫాస్ట్ స్పెషల్ స్పెషల్‌ ఈ నెల 13 నుంచి ప్రతి మంగళవారం ప్రారంభం కానుంది. 14న సుల్తాన్‌పూర్‌ నుంచి అహ్మదాబాద్‌కు వస్తుంది.

ట్రైన్‌ నంబర్‌ 09421/09422 అహ్మదాబాద్-పాట్నా-అహ్మదాబాద్ మధ్య 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతి మంగళవారం పాట్నా నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తుంది. రైలు నంబర్‌ 19409/19410 అహ్మదాబాద్ – గోరఖ్‌పూర్‌ – అహ్మదాబాద్ మధ్య సూపర్ ఫాస్ట్ ట్రైన్‌ ఈ నెల 15 నుంచి ప్రతి గురువారం, శనివారం నడవనుంది. ప్రతి సోమ, శనివారాల్లో గోరఖ్‌పూర్‌ నుంచి అహ్మదాబాద్‌కు నడస్తుంది.

ఇవి కూడా చదవండి..

అలియాభట్‌కు కరోనా పాజిటివ్‌
ఐదు రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి
ఖమ్మంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఢిల్లీలో కరోనా పంజా.. సీఎం అత్యవసర సమావేశం
దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్‌ టీకా పంపిణీ
కరోనా ఎఫెక్ట్‌.. ముంబై – అహ్మదాబాద్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు

ట్రెండింగ్‌

Advertisement