e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News కేంద్రానివి తుగ్లక్‌ చర్యలు : రాహుల్‌ గాంధీ

కేంద్రానివి తుగ్లక్‌ చర్యలు : రాహుల్‌ గాంధీ

కేంద్రానివి తుగ్లక్‌ చర్యలు : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్రం తుగ్లక్‌ విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. వైరస్​ నియంత్రణకు తుగ్లక్​ ‘లాక్​డౌన్​, గంటలు కొట్టడం, దేవుడ్ని ప్రార్థించడం వంటివి చేస్తోంది’ శుక్రవారం ట్వీట్‌ చేశారు. దేశంలో రికార్డు స్థాయిలో శుక్రవారం 2,17,353 కొవిడ్‌ కేసులు నమోదవగా.. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు 1.43 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కొవిడ్‌ నియంత్రణ చర్యలు, టీకా పంపిణీ, కేంద్రం నిర్ణయాలను చాలా సార్లు తప్పుపట్టింది.

గతేడాది కరోనా కట్టడికి కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో పాటు.. చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి కరోనా వారియర్స్‌కు మద్దతు నిలువాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విమర్శలు గుప్పించారు. గత కొద్ది రోజులుగా రాహుల్‌ కొవిడ్‌ వైరస్ వ్యాప్తి నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాహుల్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో తీసుకున్న నిర్ణయంపై కూడా రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. కొద్దిరోజుల కిందటే రాహుల్ గాంధీ ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

ఈనెల 30 వ‌ర‌కు గురుకుల‌సెట్‌ దర‌ఖాస్తులు
నీట్‌-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్‌ఐ
రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్‌ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్‌ సీఈఓ
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
కరోనా సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి
దేశంలోకి త్వరలో కొత్తగా ఎనిమిది బ్యాంకులు
వరుసలో 42 శవాలు.. చివరి ఖర్మలకూ తప్పని పాట్లు
Advertisement
కేంద్రానివి తుగ్లక్‌ చర్యలు : రాహుల్‌ గాంధీ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement