కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ అధికారిక నివాసంలో బుధవారం ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. దీదీతో గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా దీదీకి అభినందనలు’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్లో ఇటీవల 292 నియోజకవర్గాలకు ఎనిమిది విడుతల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. గత ఆదివారం వెలువడిన ఫలితాల్లో 213 నియోజకవర్గాల్లో విజయం సాధించి, వరుసగా మూడోసారి బుధవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Congratulations to Mamata Didi on taking oath as West Bengal’s Chief Minister. @MamataOfficial
— Narendra Modi (@narendramodi) May 5, 2021