మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు | మరాఠా రిజర్వేషన్లపై బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ : మరాఠా రిజర్వేషన్లపై బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, 50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని కోర్టు పేర్కొంది. 1992 మండల్ తీర్పులో సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పునః సమీక్షించాల్సిన అవసరం లేదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పీజీ మెడికల్ కోర్సుల్లో కొత్త రిజర్వేషన్ల చట్టం మేరకు ఇప్పటికే చేపట్టిన ప్రవేశాలు కొనసాగుతాయని తెలిపింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.
విద్య, సామాజికపరంగా వెనుకబడిన వర్గంగా మరాఠా సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ 2018లో మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్ధల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలవగా.. కోర్టు చట్టాన్ని సమర్థించింది. అయితే, బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించొద్దంటూ 2019లో తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లపై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. సమర్థించింది. రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సామాజికంగా, విద్యా పరంగా వెనకబడినవారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని పేర్కొంది. కేసులో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మార్చి 26న తీర్పు రిజర్వు చేయగా.. మరాఠా రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేస్తూ బుధవారం తీర్పును వెలువరించింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్
కరోనా ఎఫెక్ట్.. 16 రైళ్లను రద్దు చేసిన రైల్వే
డబుల్ మ్యూటెంట్ ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా
తెలంగాణలో కొత్తగా 6,361 కరోనా కేసులు
కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
కరోనా వేళ కలప సాయం
బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లాస్మా మాకివ్వరూ!
వ్యాక్సినేషన్ పేరిట ఫేక్కాల్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

