పెన్‌పహాడ్, అక్టోబర్ 14 : పెన్‌పహాడ్ మండల వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, పాత నేరస్తుల కదలికలు, ముఠాల కదలికలు, అనుమానితుల కదలికలు నిర్మూలించడంలో భాగంగా భద్రత, రక్షణే ఉద్దేశంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మంగళవారం నాఖాబంది నిర్వహించినట్లు ఎస్ఐ గోపి కృష్ణ తెలిపారు. మాచారం గ్రామ చివారులో నిర్వహించిన నాకబంది తనిఖీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. పశువులు, పిడిఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా జరగకుండా కూడా తనిఖీలు చేట్టినట్లు చెప్పారు.
అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ ను డివైస్ స్కానర్లతో తనిఖీ చేసినట్లు వెల్లడించారు. మండల వ్యాప్తంగా పోలీసు శాఖ చేపట్టిన ఈ నాఖాబంది ద్వారా ప్రజా-కేంద్రీకృత భద్రతా వ్యవస్థ మరింత బలపడేలా చేస్తోందన్నారు. అదేవిధంగా ఈ చర్యలు మండల ప్రజల రోజువారీ జీవనాన్ని సురక్షితంగా మార్చి, క్రైమ్ రేట్‌ను తగ్గించడానికి ఉపయోగ పడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాములు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.