SLW vs NZW : ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్ బౌలర్లను దంచేస్తూ భారీ స్కోర్ కొట్టిన శ్రీలంకకు వరుణుడు షాకిచ్చేలా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షార్పణం కాగా.. రోజు కూడా కొలంబోలో భారీగా వాన పడుతోంది. లంక ఇన్నింగ్స్ ముగిసిన కాసేపటికే మైదానంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో.. పూర్తి ఓవర్ల ఆట సాధ్యమవుతుందా? లేదంటే.. రద్దయ్యే పరిస్ధితి వస్తుందా? అని తొలి విజయంపై కన్నేసిన లంక జట్టు కాస్త ఆందోళనగా ఉంది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆటపట్టు, నీలాక్షి డిసిల్వా అర్ధ శతకాలతో మెరవగా 258 రన్స్ చేసింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ ఈ మైదానంలో ఇదే భారీ స్కోర్ కావడంతో విజయంపై దీమాతో ఉన్న లంకను వర్షం కంగారెత్తిస్తోంది. వర్షం పెద్దగా పడుతుండడంతో మ్యాచ్ సాగుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. చినుకులు మొదలవ్వడంతో సిబ్బంది పిచ్‌ను పూర్తిగా ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు.
Heavy Raining at R Premadasa Stadium #sportspavilionlk #danushkaaravinda #CWC25 #SLvNZ #srilanka pic.twitter.com/WK4o0O1tTQ
— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) October 14, 2025
వాన తగ్గాక.. ఔట్ ఫీల్డ్ సిద్ధం చేసి మ్యాచ్ ప్రారంభం కానుది. అప్పటికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఒకవేళ అరగంట పైనే ఆటకు అంతరాయం ఏర్పడితో డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం ఓవర్లు కుందించి .. కివీస్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశముంది.