Dangerous Car Stunt | రద్దీ రహదారిపై ఓ వ్యక్తి కారుతో ప్రమాదకర స్టంట్స్ (Dangerous Car Stunt) ప్రదర్శించారు. అతివేగంగా నడపడమే కాకుండా.. ఎలా పడితే అలా వెళ్తూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గ్రేటర్ నోయిడా (Noida)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మారుతీ సుజుకి బలెనో కారులో ప్రమాదకర స్టంట్స్ ప్రదర్శించారు. రోడ్డుపై అతివేగంగా వెళ్తూ సడెన్గా బ్రేక్ వేయడం.. కారును ఓ వైపుకు తిప్పడం వంటివి చేశాడు. అతడి చర్యతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ఈ తతంగాన్నంతా తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైలర్గా మారి పోలీసులు దృష్టికి చేరింది. నోయిడా ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఏకంగా రూ.57,500 ఫైన్ వేశారు.
A guy performed stunts with his car on
the streets of Greater Noida. 🚗💨
Noida Traffic Police took action and imposed a fine of ₹57,500.
Good Job, @Noidatraffic 👏👏 pic.twitter.com/Qn1nmGpmJj— Greater Noida West (@GreaterNoidaW) October 10, 2025
Also Read..
Gold prices | తులం @ రూ.1.30 లక్షలు.. ఆల్టైమ్ హైకి బంగారం.. ఈ ఏడాది 50శాతం పెరిగిన ధరలు
Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఆదేశం