Lalu Yadav | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Elections) ముందు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav) ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్పై సోమవారం ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపింది.
లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల (IRCTC hotels) నిర్వహణ కాంట్రాక్టులు కేటాయించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి (Bihar Assembly elections). రాంచీ, పూరీల్లోని రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇదంతా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని పేర్కొంది.
ఈ మేరకు 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ (CBI Charge Sheet) ఆరోపణలతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Delhi Rouse Avenue court) ఏకీభవించింది. ఈ మేరకు లాలూ, ఆయన భార్య, కుమారుడిపై ఢిల్లీ కోర్టు తాజాగా అభియోగాలు మోపింది. దీంతో ఈ కుంభకోణం కేసులో వీరు విచారణను ఎదుర్కోనున్నారు. అయితే, యాదవ్ కుటుంబం ఈ ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తోంది. తమపై ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసును బనాయించారని వాదిస్తోంది.
Also Read..
Gold prices | తులం @ రూ.1.30 లక్షలు.. ఆల్టైమ్ హైకి బంగారం.. ఈ ఏడాది 50శాతం పెరిగిన ధరలు
Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
Suresh Gopi | మంత్రిగా డబ్బులు రావట్లేదు.. సినిమాలే చేసుకుంటా : కేంద్రమంత్రి సురేశ్ గోపీ