కట్టంగూర్, అక్టోబర్ 14 : పురుగుల మందులు, డ్రోన్ స్ప్రేలు, ఎరువుల వినియోగంపై ఇఫ్కో అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ శ్రీ కృపా శంకర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాములలోని కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో ఇఫ్కో షాపులను ప్రారంభించి మాట్లాడారు. రైతులు నానో యూరియాను వాడితే పంటలో మంది దిగుబడులు వచ్చి లాభాలను పొందవచ్చన్నారు. 500 ఎంఎల్ నానో యూరియా బాటిల్ 45 కిలోల యూరియాకు సమానమని తెలిపారు. ఆరుతడి పంటల వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి అధిక ఆధాయం వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లా మేనేజర్ వెంకటేష్, రవీంద్రనాయక్, ఎఫ్పీఓ సలహాదారులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మరెడ్డి, ఐఆర్ డీఎస్ చైర్మన్ రమేష్, ఎఫ్పీఓ చైర్మన్ సైదమ్మ, డైరెక్టర్లు అనంతరెడ్డి, పుండరీకాక్షుడు, సురేష్, అంజయ్య, రైతులు పాల్గొన్నారు.