Pumpkin | గుమ్మడికాయ (Pumpkin).. దీన్ని కూష్మాండం అని కూడా అంటారు. ఇది సాధారణంగా 20 నుంచి 30 కేజీలు ఉంటేనే అబ్బో అంటాం. అలాంటిది అమెరికా వాసులు ఈ పరిమాణం గుమ్మడికాయలు చూస్తే అబ్బే అంటారు. అంటే వారికి ఇది చాలా చిన్నవి అన్నమాట. అమెరికాలో గుమ్మడికాయల సాగు ఎక్కువ. కొందరు రైతులు భారీ పరిమాణంలో పండిస్తే.. ఇంకొంతమంది వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దుతుంటారు. అలా పండించిన గుమ్మడికాయలను పదర్శించేందుకు ఏటా ఛాంపియన్ షిప్ కూడా నిర్వహిస్తారు.
ఈ సారి కూడా కాలిఫోర్నియా (California)లోని దక్షిణ శాన్ఫ్రాన్సిస్కోలో గల హాఫ్ మూన్బేలో 52వ వరల్డ్ ఛాంపియన్ షిప్ పంప్కిన్ వేఆఫ్ (52nd World Championship Pumpkin Weigh-Off) నిర్వహించారు. ఈ పోటీల్లో సాంట రోసాకు చెందిన ఇంజినీర్ (California Engineer) బ్రాండన్ డ్వాసన్ భారీ సైజు గుమ్మడికాయను పండించి విజేతగా నిలిచాడు. ఆయన పండించి తెచ్చిన గుమ్మడికాయ బరువు ఏకంగా 1,064 కిలోలు (2,346 pounds). భారీ ఆకారంలో ఉ్న గుమ్మడి కాయ అక్కడి వారిని విశేషంగా ఆకర్షించింది. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలో ఇంజినీర్ అయిన డ్వాసన్.. గత ఐదేళ్లుగా భారీ గుమ్మడికాయలు పండిస్తున్నాడు. ఇక, అతిపెద్ద గుమ్మడికాయను పండించినందుకు గాను డ్వాసన్.. 20 వేల డాలర్లు గెలుచుకున్నాడు.
అమెరికా అంటేనే.. చిత్రవిచిత్రమైన వేడుకలకు నిలయం. అలాంటి పండుగల్లో ఒకటి.. గుమ్మడికాయల మహోత్సవం. ఏటా అక్టోబర్ నెలలో ఈ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం అమెరికా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చి ఈ ప్రదర్శనను తిలకిస్తుంటారు. ఇక ఈ పోటీల్లో గెలుపొందిన గుమ్మడికాయకు.. ‘మిస్ పంప్కిన్’ అవార్డు అందజేస్తారు. అంతేకాకుండా, అతి బరువైన గుమ్మడికాయకు ప్రత్యేక బహుమతి ప్రకటిస్తారు.
Also Read..
Gold prices | బంగారం హై జంప్.. ఒక్కరోజే రూ.3 వేలు పెరిగిన తులం ధర
Shehbaz Sharif | ట్రంప్‌పై పాక్ ప్రధాని ప్రశంసలు.. ఇటలీ ప్రధాని మెలోనీ రియాక్షన్ చూశారా..? VIDEO
Donald Trump | మీరు చాలా అందంగా ఉన్నారు.. మెలోనీపై ట్రంప్ పొగడ్తల వర్షం