Shehbaz Sharif | ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ముగింపునకు సంబంధించి శాంతి ఒప్పందంపై ఈజిప్టు వేదికగా దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni)పై ట్రంప్ (Donald Trump) పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు, పాక్ ప్రధానిని పలకరిస్తూనే భారత్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇక ఇదే సమావేశంలో ట్రంప్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పొగడ్తలతో ముంచెత్తారు. షరీఫ్ మాటలకు ఇటలీ ప్రధాని మెలోనీ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ ఎంతో కృషి చేసినట్లు పాక్ ప్రధాని చెప్పారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆయన జోక్యం చేసుకుని ఉండకపోయి ఉంటే ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవన్నారు. ట్రంప్.. నిజంగా శాంతిని కోరుకునేవారంటూ ప్రశంసించారు. ఆయన ఇప్పటి వరకూ ఏడు యుద్ధాలు ఆపారని.. ఇది (గాజా) ఎనిమిదో యుద్ధం అంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. అందుకే నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)కి ఆయన్ను నామినేట్ చేసినట్లు చెప్పారు. ఆ ప్రైజ్ అందుకునేందుకు ఆయన అర్హుడని పేర్కొన్నారు. అయితే, పాక్ ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్‌పై ఉన్న ఇటలీ ప్రధాని మెలోనీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నోటి మీద చేయి వేసుకుని చూస్తూ ఉండిపోయారు. ఆమె రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
watch Meloni as Pakistan’s Sharif fluffs Trump for next year’s Nobel pic.twitter.com/yZxQt4o2IZ
— Aaron Rupar (@atrupar) October 13, 2025
Also Read..
Donald Trump | మీరు చాలా అందంగా ఉన్నారు.. మెలోనీపై ట్రంప్ పొగడ్తల వర్షం
Justin Trudeau: క్యాటీ పెర్రీకి కిస్సిచ్చిన జస్టిన్ ట్రూడో.. కెనడా మాజీ ప్రధానిపై ట్రోలింగ్