న్యూఢిల్లీ: కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) వివాదంలో చిక్కుకున్నారు. అమెరికా సింగర్, రైటర్, టీవీ పర్సనాల్టీ క్యాటీ పెర్రీకి కిస్సు ఇచ్చిన ఫోటోలు వైరల్ కావడంతో ఆన్లైన్లో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. కాలిఫోర్నియాలోని సాంటా బార్బరాలో ఓ పడవపై క్యాటీ పెర్రీకి జస్టిన్ ట్రూడో కిస్సు ఇస్తూ కనిపించారు. ఆ ఫోటోలో ఆయన ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు. సోషల్ మీడియాలో ఆ పిక్స్ వైరల్ కావడంతో జనం ఆన్లైన్లో గగ్గోలు పెడుతున్నారు. బ్లాక్ కలర్ స్విమ్‌సూట్‌లో క్యాటీ పెర్రీ కనిపించారు. షర్ట్‌లేకుండా ఉన్న ట్రూడో ఆమెకు కిస్సు ఇచ్చాడు. క్యాటీ పెర్రీ చెంపపై ట్రూడో కిస్సు ఇస్తూ రిలాక్స్ అవుతున్నట్లు ఆ ఫోటోలో ఉన్నది.
2023లో భార్య సోఫీ గ్రిగోయిర్ ట్రూడోకు విడాకులు ఇచ్చారు జస్టిన్ ట్రూడో. 18 ఏళ్ల వైవాహకి బంధానిక ఆయన బ్రేకప్ చెప్పారు. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్జావియర్, ఎల్లా గ్రేస్, హడ్రియన్. ఈ ఏడాది ఆరంభంలో ఆయన కెనడా ప్రధాని పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. టీవీ పర్సనాల్టీ క్యాటీ పెర్రీకి అయిదేళ్ల కుమార్తె ఉన్నది. ఓర్లాండో బ్లూమ్‌ను క్యాటీ పెళ్లాడింది. అంతకముందు ఆమె కమీడియన్ రస్సెల్ బ్రాండ్‌ను పెళ్లాడింది.
ఈ ఏడాది జూలైలోనే ట్రూడో, పెర్రీలు మాంట్రియల్లో కనిపించారు. ఫ్రెంచ్ రెస్టారెంట్ లీ వయోలన్లో ఇద్దరు కలిసి ఒంటరిగా డిన్నర్ ఎంజాయ్ చేశారు.
This conceivably means we’re heading toward a future where Katy Perry writes songs about Justin Trudeau. What is life, lol? https://t.co/vdqt2c7WLE
— Claire (@gaynessie) October 12, 2025