Donald Trump | ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పొగడ్తల వర్షం కురిపించారు. మెలోనీ చాలా అందంగా (Beautiful) ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈజిప్టు (Egypt)లో జరిగిన ప్రపంచ దేశాధినేతల సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను అలా చెప్పడానికి అనుమతి లేదు. ఎందుకంటే అమెరికాలో ఓ మహిళని అందంగా ఉందని చెబితే నా రాజకీయ జీవితం ముగుస్తుంది. కానీ, నేను ఆ అవకాశాన్ని తీసుకుంటాను. మీరు అందంగా ఉన్నారని నేను చెబితే మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా..? ఎందుకంటే మీరు అలా ఉన్నారు’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Trump to Giorgia Meloni:
“In the U.S., if you tell a woman she’s beautiful, your political career is over. But I’ll take my chances. You won’t be offended if I say you’re beautiful, right?“
— Spencer Hakimian (@SpencerHakimian) October 13, 2025
ఈజిప్టు వేదికగా సోమవారం గాజా శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించి, శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరయ్యారు.
Also Read..
ముగిసిన గాజా యుద్ధం!.. ఇజ్రాయెలీ బందీలకు హమాస్ చెర నుంచి ఎట్టకేలకు విముక్తి
ఇది చారిత్రక శుభోదయం.. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగం