దేవరకొండ రూరల్, అక్టోబర్ 14 : దేవరకొండ మండల కేంద్రంలో నిర్మించనున్న గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.5,00,116/- ను మంగళవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ విరాళంతో ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ బంజారా సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నాయక్, బంజారా సంఘం పెద్దలు పాల్గొన్నారు.