Gautam Gambhir : ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన భారత జట్టు సొంతగడ్డపై తొలి సిరీస్ పట్టేసింది. రెండో టెస్టులో వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల విజయంతో క్లీన్‌స్వీప్ చేసింది టీమిండియా. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు, కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు స్వదేశంలో ఇదే మొదటి సిరీస్ విజయం. ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమని కొనియాడిని గౌతీ ఢిల్లీ వికెట్‌పై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను మంచి వికెట్ ఇస్తారని ఊహించానని కోచ్ అన్నాడు.
‘ఢిల్లీలో నల్లమట్టి పిచ్ భారత బౌలర్లకు అనుకూలించేలా ఉంటుందని ఆశించాను. కానీ, ఈ పిచ్ నుంచి పేసర్లకు కొద్దిగా కూడా సహకారం అందలేదు. స్పిన్నర్లు రాణిస్తారని తెలిసినా.. మా జట్టులోని వరల్డ్ క్లాస్ పేసర్లు కూడా అనుకూలించేలా పిచ్ ఉండాల్సింది. పిచ్ మందకొడిగా ఉండడంతో ఐదో రోజున ఫలితం వచ్చింది. ఇకపై జరుగబోయే మ్యాచ్‌లకు మంచి పిచ్ రూపొందిస్తే బాగుంటుంది.
⚡Gautam Gambhir was not happy with the Delhi pitch where India bowled 200.4 overs across two innings 👀 pic.twitter.com/Mast5QUojW
— Cricbuzz (@cricbuzz) October 14, 2025
ఎందుకంటే సుదీర్ఘ ఫార్మాట్‌ను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది. అందుకు చేయాల్సింది.. సరైన పిచ్‌లను రూపొందించడమే’ అని గంభీర్ పేర్కొన్నాడు. భారత్, వెస్టిండీస్ తలపడిన ఇదే పిచ్ మీద .. నవంబర్ 14న దక్షిణాఫ్రికాతో గిల్ బృందం ఆడనుంది. ఆలోపు తాను సూచించిన విషయాలకు తగ్గట్టుగా పిచ్‌ను సిద్ధం చేయాలని గంభీర్ తెలిపాడు.
తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసిన భారత్.. ఢిల్లీ టెస్టులోనూ పంజా విసిరింది. యశస్వీ జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(127 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం కుల్దీప్ యాదవ్ తిప్పేయగా.. విండీస్‌ను ఆలౌట్ చేసింది. ప్రత్యర్ధిని ఫాలో ఆన్ ఆడించిన శుభ్‌మన్ గిల్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వికెట్ల కోసం శ్రమించాల్సి వచ్చింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 200.4 ఓవర్లు ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. 121 పరుగుల ఛేదనలో యశస్వీ జైస్వాల్ (8) త్వరగానే ఔటైనా.. సాయిసుదర్శన్(39 ), కేఎల్ రాహుల్(54 నాటౌట్).. టీమిండియాను గెలిపించారు.
🏆 🤝 🥳
Drop your reactions to #TeamIndia‘s series victory 👇#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/kibSeXEmV1
— BCCI (@BCCI) October 14, 2025