హెచ్ఐవీ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ షురూ
హెచ్ఐవీ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ షురూ | హెచ్ఐవీ వ్యాక్సిన్ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ను యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రారంభించారు. HIVconsvX టీకా భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేసేందుకు

లండన్ : హెచ్ఐవీ వ్యాక్సిన్ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ను యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రారంభించారు. HIVconsvX టీకా భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేసేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. హెచ్ఐవీ-1 వేరియంట్లను లక్ష్యంగా చేసుకుని మొజాయిక్ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. 18-65 ఏళ్ల వయస్సు గల 13 మంది హెచ్ఐవీ నెగటివ్ కలిగి, వ్యాధి ప్రమాదం లేనివారిపై ట్రయల్స్ చేపడుతున్నారు. తొలుత వ్యాక్సిన్ ఒక మోతాదు ఇవ్వనుండగా.. తర్వాత నాలుగు వారాలకు మరో బూస్టర్ డోస్ ఇస్తారు. ‘హెచ్ఐవీ వ్యాక్సిన్ సమర్థత 40 ఏళ్లుగా అస్పష్టంగా ఉంది. హెచ్ఐవీ-నెగటివ్ వ్యక్తుల్లో హెచ్ఐవీతో సోకకుండా నిరోధించేందుకు కొత్త టీకా వ్యూహం ట్రయల్ మొదటిదని’ ప్రధాన పరిశోధకుడు తోమాస్ హాంకే పేర్కొన్నారు.
హెచ్ఐవీ వ్యాక్సిన్ అభ్యర్థుల్లో బీ-కణాల ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను ప్రేరేపించినట్టు గుర్తించారు. HIVconsvX రోగనిరోధక వ్యవస్థ శక్తివంతమైన, వ్యాధికారక నిర్మూలన టీ కణాలను ప్రేరేపిస్తుంది. హెచ్ఐవీ నుంచి రక్షణ దడంతోపాటు రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీల టీ సెల్ రెండింటి రక్షణ సామర్థ్యాన్ని వినియోగించుకోవడం చాలా ముఖ్యమని జెన్నర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ క్లినికల్ రీసెర్చ్ ఫెలో పావోలా సిక్కోని పేర్కొన్నారు. ట్రయల్స్ ఫలితాలను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి విడుదల చేయాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యూరప్, ఆఫ్రికా, అమెరికాలో సైతం హెచ్ఐవీ వ్యాక్సిన్‌పై ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం
ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందా.. ఇదిగో పరిష్కారం
తెలంగాణలో మూడు రోజులు వానలు
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం
ఘోరం : లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య
అసోం, మేఘాలయలో భారీ భూకంపం
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

