దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరణాలు
కరోనా కేసులు | దేశంలో కరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 47,240 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో 930 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,63,665కు పెరిగింది. మొత్తం 2,97,99,534 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో 4,04,211 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో 4,59,920 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 97.18శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.39శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.29శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. టీకాల పంపిణీ కార్యక్రమంగా వేగంగా సాగుతున్నదని తెలిపింది. మొత్తం 36.13 కోట్ల డోసులు టీకా డ్రైవ్లో పంపిణీ చేసినట్లు వివరించింది. నిన్నటి వరకు మొత్తం 42.33 కోట్ల కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం
ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందా.. ఇదిగో పరిష్కారం
తెలంగాణలో మూడు రోజులు వానలు
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం
ఘోరం : లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య
అసోం, మేఘాలయలో భారీ భూకంపం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

