కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య
కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య |

న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి పీఆర్ కుమారమంగళం భార్య మంగళవారం రాత్రి ఢిల్లీలోని నివాసంలో హత్యకు గురయ్యారు. కిట్టి కుమారమంగళం (67) దక్షిణ ఢిల్లీలోని వసంత్‌విహార్ ప్రాంత ఇంట్లో శవమై బుధవారం ఉదయం కనిపించారు. దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కిట్టీ కుమారమంగళం హత్య కేసులో నిందితుడు ఒకరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హత్య ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
కిట్టీ కుమారమంగళం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆమె భర్త పీ రంగరాజన్ కుమారమంగళం మొట్టమొదట 1984 లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991-92 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరారు. వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 1998లో ఆయన విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కుమారుడు రంగరాజన్ మోహన్ కుమారమంగళం కాంగ్రెస్ నేత. బెంగళూరులో నివాసం ఉంటుండగా.. తల్లి హత్య వార్త తెలుసుకున్న వెంటనే ఢిల్లీకి బయలుదేరారు.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం
ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందా.. ఇదిగో పరిష్కారం
తెలంగాణలో మూడు రోజులు వానలు
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం
ఘోరం : లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

