మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం | కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు.

శ్రీనగర్ : కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు. ఈ క్రమంలో సాంబా, రాంబన్, బారాముల్లా జిల్లాల్లో డ్రోన్లు, ఇతర చిన్నస్థాయిలో ఎగిరే వస్తువుల అమ్మకాలు, నిల్వ, వినియోగంపై అధికారులు నిషేధం విధించారు. జమ్మూలోని ఐఎఎఫ్ స్టేషన్ వద్ద సాయుధ డ్రోన్లతో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత శ్రీనగర్ సరిహద్దు జిల్లాలైన రాజౌరి, కథువాలోని అధికారులు ఇప్పటికే బ్యాన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. బారాముల్లాలో డ్రోన్ కెమెరాలు, ఎగిరే వస్తువులు ఉన్న వారు స్థానిక పోలీసు స్టేషన్లలో జమ చేయాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాటిని వినియోగించుకునే ప్రమాదం ఉన్నందున ఈ నిషేధం విధించినట్లు రాంబన్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఇటీవల జమ్మూ ఐఏఎఫ్ స్టేషన్లో డ్రోన్లతో బాంబు దాడులకు దిగగా.. ఇద్దరు సిబ్బందికి గాయాలు కాగా.. ఓ భవనం పైకప్పు కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం
ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందా.. ఇదిగో పరిష్కారం
తెలంగాణలో మూడు రోజులు వానలు
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

