వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూతురు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆ తల్లి హైదరాబాద్‌లోని దవాఖానకు అంబులెన్స్‌లో వెళ్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు వెంటాడింది. సోన్ ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం..
- ప్రమాదంలో తల్లీకూతురు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
సోన్, అక్టోబర్ 23 : తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూతురు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆ తల్లి హైదరాబాద్‌లోని దవాఖానకు అంబులెన్స్‌లో వెళ్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు వెంటాడింది. సోన్ ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడకు చెంది న మెస్రం సరస్వతి (22) అనారోగ్యంతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నది.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ నిమ్స్‌కు వైద్యు లు రెఫర్ చేశారు. సరస్వతిని తల్లి మెస్రం పారుబాయి (55), కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా గురువారం రాత్రి నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామ శివారు వద్దకు రాగానే రాంగ్రూట్లో వచ్చిన లారీ అంబులెన్స్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు పారుబాయి, సరస్వతి మృతిచెందారు. మరో ముగ్గురు కుటుంబసభ్యులతో పాటు అంబులెన్స్ డ్రైవర్, లారీ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

