రాష్ట్రాల వద్ద అందుబాటులో కోటి డోసులు : కేంద్రం
రాష్ట్రాల వద్ద అందుబాటులో కోటి డోసులు : కేంద్రం |

న్యూఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం కోటి డోసులకుపైగా అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 80 లక్షలకుపైగా అదనంగా మోతాదులు పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. యూపీ, మహారాష్ట్ర, బిహార్, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల వద్ద టీకాల బ్యాలెన్స్ అత్యధికంగా ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు దాదాపు 15.7కోట్ల మోతాదులను రాష్ట్రాలకు, యూటీలకు ఉచితంగా అందించామని, ఇందులో వృథా సహా 14.6 కోట్ల డోసులు వినియోగించినట్లు పేర్కొంది.
టీకా డోసులు నిండుకోవడంతో వ్యాక్సినేషన్ ప్రభావితమైనట్లు మహారాష్ట్రకు చెందిన కొందరు అధికారులను ఉటంకిస్తూ వచ్చిన వార్తలపై ఈ సందర్భంగా కేంద్రం వివరణ ఇచ్చింది. ఏప్రిల్ 27న ఉదయం 8 గంటల వరకు మహారాష్ట్ర 1,58,62,470 డోసులు అందుకుందని, ఇందులో 0.22శాతం వృథా అవగా.. 1,49,39,410 డోసులు వినియోగించిందని కేంద్రం పేర్కొంది. అర్హత ఉన్న వ్యక్తులకు టీకాలు వేసేందుకు 9,23,060 డోసులు రాష్ట్రం వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో మూడు లక్షల డోసులు పంపించనున్నట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
భారత్కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
తెలంగాణకు రెండు రోజులు వర్ష సూచన
కరోనాతో ప్రధాని పిన్ని కన్నుమూత
కెనడాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
ఈశాన్య భారతాన్ని వణించిన భూకంపం
4వేల కోవిడ్ కేర్ కోచ్ల్లో 64వేల బెడ్లు : రైల్వే
కరోనాపై పోరులో భారత్కు సహాయం : యూఎన్ సెక్రెటరీ జనరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

