కెనడాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
కెనడాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి | కెనడాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ మృతి చెందింది.

మాంట్రియల్ : కెనడాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ మృతి చెందింది. వ్యాక్సిన్‌తో ముడిపడి ఉన్న మొదటి మరణం ఇదేనని ప్రాంతీయ అధికారులు మంగళవారం ప్రకటించారు. 54 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించడంపై క్యూబెక్ ప్రీమియర్ ఫ్రాంకోయిన్ లెగాల్ట్ విచారం వ్యక్తం చేశారు. ప్రావిన్స్ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ హోరాసియో అర్రుడ మాట్లాడుతూ ఆమె ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చికిత్సలు చేసినా.. కాపాడలేకపోయామన్నారు. మహిళ సెరిబ్రల్ థ్రోబోసిస్తో మరణించిందని చెప్పారు.
అయితే, 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ను ఉపయోగించాలన్న ప్రభుత్వ సిఫారసులను మార్చవద్దని సూచించారు. తీవ్రమైన సమస్యల గురించి తమకు తెలుసునని, ఇప్పటి వరకు నాలుగు లక్షలకుపైగా ఆస్ట్రాజెనెకా టీకాలు వేసినట్లు గుర్తుంచుకోవాలని ఆరోగ్యమంత్రి క్రిస్టియన్ డ్యూబ్ పేర్కొన్నారు. తక్కువ ప్లేట్‌లెట్స్‌తో సంబంధం ఉన్న రక్త గడ్డకట్టిన కేసులు మరో నాలుగు దేశంలో నమోదయ్యాయని, వారంతా కోలుకున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా గత శుక్రవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
తెలంగాణకు రెండు రోజులు వర్ష సూచన
పెయిన్‌కిల్లర్స్‌తో కరోనా తీవ్రం: ఐసీఎంఆర్
విద్యాశాఖలో 9000 పోస్టులు!
ఎస్బీఐలో 5454 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కరోనాతో ప్రధాని పిన్ని కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

