కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం | భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా 617 వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, వైట్‌హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు.

వాషింగ్టన్ : భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా 617 వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, వైట్‌హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించాక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో కొనసాగుతున్న పరిస్థితులకు, మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే ఏకైక విరుగుడని ఫౌసీ సూచించారు.
అలాగే సార్క్-కోవ్-2 వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు విడుదల చేయడంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ పని చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ సైతం పేర్కొంది. నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జనవరి 3న దేశంలో అత్యవసర వ్యాక్సిన్ వినియోగం కోసం అనుమతి పొందింది. క్లినికల్ ట్రయల్స్ తర్వాత టీకా 78శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.

ఇదిలా ఉండగా.. కరోనా కట్టడిలో భారత్‌కు సహాయం అందించేందుకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన స్ట్రయిక్ టీమ్ త్వరలోనే భారత్‌కు వెళ్తుందని వైట్‌హౌస్ కొవిడ్-19 రెస్పాన్స్ సీనియర్ సలహాదారు డాక్టర్ ఆండీ స్లావిట్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. భారత్‌లో ఎక్కువ వ్యాక్సిన్లను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలను గుర్తించామని, వీటితో ఎంతో సహాయంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. సంక్షోభ పరిస్థితుల్లో భారత్‌కు అండగా నిలుబడుతామని, వ్యాక్సిన్ల తయారీ, రాపిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, రా మెటీరియల్ సహా అన్ని వనరులను సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
తెలంగాణకు రెండు రోజులు వర్ష సూచన
కరోనాతో ప్రధాని పిన్ని కన్నుమూత
కెనడాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

