e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు

ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు

ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు

తిరుమల : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా జరుగనున్నాయి. కొవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తుల‌ను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. ఐదు రోజుల‌ పాటు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల‌ వరకు ఉత్సవమూర్తులకు తిరుమజనం (అభిషేకం) చేస్తారు. 20న శ్రీకృష్ణస్వామివారికి, జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి, 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహిస్తారు. తెప్సోత్సవాల కారణంగా ఐదు రోజుల పాటు కల్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి..

పిల్లలపై టీకా ట్రయల్స్‌
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఆలస్యం!
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
పిడుగులకు 26 మంది బలి
గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం
ఢిల్లీ మెట్రో రికార్డు.. అన్‌లాక్‌ తొలిరోజే 4.5లక్షల మంది ప్రయాణం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు

ట్రెండింగ్‌

Advertisement